>

నవ భారత నిర్మాణం లో విలియం కేరి కీలక పాత్ర William Carey's role in Nation building

విలియం కేరి ఒక అనితరసాధ్యుడు  

ఆంగ్ల మిషనరీ, సంఘ సంస్కర్త, సాంస్కృతిక మానవ శాస్త్రవేత్త, సాహిత్యవేత్త, అనువాదకుడు, సెరంపూర్ విశ్వవిద్యాలయ స్థాపకుడు, వ్యవసాయ సంఘం వ్యవస్థాపకుడు, బ్యాంకింగ్ సిస్టమ్ వ్యవస్థాపకుడు, ఆవిరి యంత్రము, సాంకేతిక ఆవిష్కరణలు, వార్తాపత్రిక ఎడిటర్, భాషాపరమైన సంస్కరణ , మొదలైనవి..

*జననం* -ఆగష్టు-17-1761

*మరణం* జూన్-9-1834

దేవుని గొప్ప సేవకుడు దైవజనుడు మిషనరిగా మన భారత దేశానికి వచ్చి, క్రీస్తుప్రేమలో ఎన్నో గొప్ప పనులు చేసిన గొప్ప సేవకుడు విలియమ్ కెరీ.

     ప్రపంచ సువార్తీకరణ పట్ల, తన చర్చి పట్టనట్టుగా ఉండటాన్ని సహించలేని కేరీ, 1790లో ఒక ఆందోళనచేపట్టాడు. లోకమంతటా సువార్త ప్రకటింపబడాలని ప్రార్ధిస్తూ కూర్చుంటే సరిపోదని కేరీ వాదించాడు. ఏదో ఒకటి చేయాలని, ఒక విధి విధానాన్ని అవలంబించాలని చెబుతూ వచ్చాడు.



1792లో ‘An Enquiry into the Obligations of Christians to Use Means for the Conversion of the Heathens’ అనే పేరుతో ఒక పరిశోదనాత్మక వ్యాసాన్ని ప్రచురించాడు. దేవుని మహిమాయుత ప్రణాళిక నెరవేరడానికి మనమూ ఆయనతో చేతులుకలపాలనే భావాన్ని అందులో వ్యక్తం చేసాడు.  'ఆంగ్లభాషలో మిషనరీ పరిచర్యకు సంబంధించిన పరిశోధనాత్మక వ్యాసాల్లో ఒక రకంగా అదే మొదటిదీ, నేటికీ అదే గొప్పదీ" అని కేరీ జీవితచరిత్ర రాసిన జార్జ్స్మిత్ పేర్కొన్నాడు.


ఆ వ్యాసానికి అనుసంధానంగా, నాటింగ్ హామ్ లో, బాప్టిస్ట్ సేవకుల సమావేశంలో కేరీ చేసిన ప్రసంగం అక్షరాలా చారిత్రాత్మకమయ్యింది.


*'నీ గుడారపుస్థలమును విశాలపరచుము*


*నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము*


*నీ తాళ్ళను పొడుగుచేయుము నీమేకులను దిగగొట్టుము*


*కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు*


*నీ సంతానము అన్యజనులదేశమును స్వాధీనపరచుకొనును*


*పాడైన పట్టణములను నివాసస్థలములుగా చేయును భయపడకుము'*


అంటూ యెషయా 54 ఆధారంగా కేరీ చేసిన ప్రసంగం ఒకకొత్త మిషనరీ శకానికి నాంది పలికింది. 


👉 *'గొప్ప వాటినిదేవుని నుండి ఆశించండి, గొప్పవాటిని దేవుని కోసంచేపట్టండి'* అంటూ కేరీ ఎలుగెత్తి చాటాడు.


👉 పర్యవసానంగా కెటరింగ్ అనే ఒక చిన్ని పట్టణంలో మరోసమావేశం జరిగింది. ప్రపంచ సువార్తీకరణ కోసం ఒక మిషనరీ సొసైటీ ఏర్పడింది. అప్పుడు వాళ్ళ వద్ద ఉన్నది... పదమూడు పౌండ్ల చిల్లర!


 నిజానికి విలియం, జాన్ థామస్ అనే ఇద్దరిని ఇండియాకు మిషనరీలుగా పంపాలని సొసైటీ మొదట నిర్ణయించింది. అయితే, దీనికి సంబంధించి లండన్ లో జరిగిన సమావేశం చివర్లో, స్థానిక భారతీయ భాషల్లోకి బైబిల్ని అనువాదం చేయాలన్న తన కోరికను కేరీ వెల్లడించాడు. ఆ సమావేశానికి హాజరైన విలియం వార్డ్అనే ఒక ప్రింటర్, కేరీని కలిసి ఇండియాకు రమ్మని ప్రోత్సహించాడు.  


విచిత్రమేమిటంటే, కేరీ అచ్చమైన కాల్వినిస్టు! కాల్వినిస్టులు ప్రిడెస్టినేషన్ అంటూ సువార్త పనిని అలక్ష్యం చేస్తారనే అభిప్రాయానికి భిన్నంగా కేరీ మిషనరీ పరిచర్య పట్ల తీవ్రమైన శ్రద్దా, బాధ్యతా, భారాన్నీ ప్రదర్శించాడు. మిషనరీ పని చేయాలని వ్యాసాలు రాయటం, ప్రసంగాలు చేయటంతో కేరీ ఊరుకోలేదు. *1793 జూన్ 13న తన కుటుంబంతో సహా ఇండియాకు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం!*


👉 *భారత దేశంలో అడుగుపెట్టాక కేరీకి ఎదురైన వ్యతిరేకత అసాధారణమైంది. బ్రిటీషు పార్లమెంటు, ఈస్ట్ ఇండియాకంపెనీ, మిలటరీ, ప్రాచ్య పండితులు అందరూ తనకు వ్యతిరేకమే. విచిత్రంగా తనను పంపిన సొసైటీ బోర్డ్ వారినుంచీ, తను ఏ ప్రజలకు సేవ చేయాలని వచ్చాడో ఆ ప్రజల నుంచీ కూడా వ్యతిరేకత ఎదురవ్వటం శోచనీయం.*

Missionary William Carey to india


👉 *మిషనరీలు అనగానే పాశ్చాత్య దేశాల సంస్కృతిని వ్యాప్తి చేస్తారనీ, స్థానిక సంస్కృతిని హరించి వేస్తారనీ సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే కేరీ మిషనరీ పరిచర్యను పరిశీలించిన ఎవరైనా ఆ అభిప్రాయం తప్పు అని ఒప్పుకుని తీరతారు.*


 భారత దేశంలోని స్థానిక సంస్కృతీ, స్థానిక భాషల పరిరక్షణ కోసం కేరీ చేసినంత కృషి, అంతకు మునుపు కానీ, ఆ తర్వాత కానీ, మరే భారతీయుడూ చేయలేదనేది నిర్వివాదాంశం. విలియంకేరీని కేవలం మిషనరీ అంటే సరిపోదు. నేటి క్రైస్తవ ప్రపంచం కీర్తిస్తున్నట్టుగా *'ఆధునిక ప్రేషితోద్యమ పితామహుడు'* అనే బిరుదు కూడా ఆయనకు చాలదు. Father of Modern Missions


👉 *సామాజికంగా ఎదురయ్యే వ్యతిరేకతలు, మతిస్థిమితం లేని భార్య, తరచూ అనారోగ్యం పాలయ్యే పిల్లలు, నిత్యం వెంటాడే ఆర్ధిక ఇబ్బందులు... వీటన్నిటి నడుమ కేరీ ఏమి చేసాడో, ఎంత సాధించాడో తెలుసుకుంటే అవాక్కవుతాం. ఒక సగటు మిషనరీ తన జీవితకాలంలో ఇన్ని పనులు ఎలా చేయగలిగాడు అనేది ప్రపంచవ్యాప్త మిషనరీలందరికీ, ఎప్పటికీ ఒక పెద్ద సవాలుగానే ఉంటుంది.*


👉 కేరీ వృక్షశాస్త్రజ్ఞుడు. *‘ఇంగ్లీష్ డెయ్ జీ’ అనే పూల మొక్కను ఇండియాకు తెచ్చిందీ కేరీయే.*

 *తోటపనిలో లినీయన్ (Linnaean) విధానాన్ని భారతదేశానికిపరిచయం చేసాడు.*

 *విలియం రాక్స్ బర్గ్ రాసిన బోటనీ ప్రామాణిక గ్రంధం 'ఫ్లోరికా ఇండికా'కు సంపాదకుడు కేరీయే.*


 *'హోర్టాస్ బెంగాలెనిస్' వంటి ఇతర సైన్సు పుస్తకాల్ని కూడా ముద్రించాడు. బోటనీలో కేరీ కృషిని గుర్తిస్తూ ఒక మొక్కకు Careya herbacea అని ఆయన పేరునే పెట్టారు.*

👉 *ఈ సృష్టంతా ఒక మాయో మిథ్యో కాదనీ, ఇది వాస్తవమని, దేవుని చేతి పననీ, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలనీ ప్రజలకు తెలియ చేయటం కోసం తరచూ సైన్స్ అవగాహనా సదస్సుల్లో మాట్లాడుతుండేవాడు.*


♻️ *కేరీ సువార్తీకరణ విధానంలో మూడు భాగాలున్నాయి :*


 *1. సువార్త ప్రకటన* 

*2. బైబిల్ అనువాదం* 

*3. స్కూళ్ళ స్థాపన.*


 దాదాపు మూడు వేలసంవత్సరాలుగా భారతీయుల్ని మూఢ నమ్మకాల చీకటిలోనే ఉంచేసిన దుస్థితినీ, విద్య జ్ఞానం అనేవి అగ్రవర్ణాల వారికి మాత్రమే పరిమితం చేసిన మత సంస్కృతిని కేరీ సహించలేకపోయాడు. నాటి వర్ణవ్యవస్థకు చెంపపెట్టుగా, అన్ని కులాల పిల్లలు కలిసి చదువుకునేందుకు వీలుగా, తన మిత్రులతో కలిసి సిరంపూర్ కాలేజ్ ను స్థాపించాడు. ఆసియాలోనే తొలి డిగ్రీ కాలేజ్ గా అది సుప్రసిద్ధం. ఆ తర్వాతి ఇరవై ఏళ్ళలో సిరంపూర్ మిషనరీలు 103స్కూళ్ళను తెరిచారు(దాదాపు 7000 విద్యార్ధులు… అదీ, ఆ రోజుల్లో!).  


*·ఇంగ్లాండ్ లో రాయల్ అగ్రికల్చరల్ సొసైటీస్థాపించడానికి 30 సంవత్సరాలకు ముందే, అంటే 1823లో 'అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా'స్థాపించాడు.*

Agri-horticulture society of India 

 *భారతదేశంలోని వ్యవసాయం గురించి ఒక క్రమబద్దమైన రీసర్చ్ చేసి, వ్యవసాయంలో సంస్కరణలు తేవడం కోసం తరచూ 'ఏషియాటిక్రీసర్చేస్' Asiatic Research అనే జర్నల్ కి వ్యాసాలు అందించాడు.*


*దాదాపు 60 శాతం అరణ్యంలా మిగిలి ఉన్న దేశాన్ని సుభిక్షంగా, సాగు నేలగా చేయటమే కేరీ ఉద్దేశ్యం.*


👉 *కేరీ అటవీ పరిరక్షకుడు:-*  Carey is a Forest conservator భారత దేశంలో అటవీ పరిరక్షణ పై రచనలు చేసిన మొట్టమొదటి వ్యక్తి కేరీనే. భారత ప్రభుత్వం మొట్ట మొదటి సారిగా మలబార్ లో అటవీ సంరక్షణ చర్యలు చేపట్టడానికి సుమారు 50 ఏళ్ళకు ముందే, కేరీ అటవీ సంరక్షణపై వ్యాసాలు రాసాడు. తన పత్రిక 'ఫ్రెండ్ ఆఫ్ఇండియా'లో రాసిన వ్యాసాలకు స్పందించే, ప్రభుత్వం బర్మా అడవులకు డా.బ్రాండిస్ ను, దక్షిణభారత అడవులకు డా.క్లేఘమ్  ను సంరక్షణ పర్యవేక్షకులుగా నియమించింది.


👉 *భారతదేశానికి స్టీమ్ ఇంజన్ని మొదటిగా పరిచయం చేసింది కూడా కేరీనే.* దాన్ని నమూనాగా తీసుకుని స్థానిక పరికరాలు, వస్తు సామాగ్రితో దేశీ స్టీమ్ఇంజన్ని తయారు చేయమని స్థానిక కమ్మరివారినిప్రోత్సహించాడు.


👉 *ప్రచురణ పరిశ్రమల కోసం,  దేశీయంగా పేపర్ ని ఉత్పత్తి చేసిన మొదటి వ్యక్తి ఆయనే.*


👉 *అన్యాయంగా దోచుకునే అధిక వడ్డీ విధానం వాక్యానుసారం కాదని గుర్తెరిగి దాన్ని ఎదుర్కొనేందుకు 'సేవింగ్స్ బ్యాంకు' ఆలోచననుఇండియాకు పరిచయం చేసాడు.*


👉 *కేరీ రాక ముందు వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల్ని సజీవదహనం చేసేవారు. కుష్టువ్యాధి గలవారిని యేసు ప్రేమించాడు. ముట్టుకుని స్వస్థపరిచాడు. కాబట్టి వారిని మనమూ ప్రేమగా చూడాలని, లెప్రసీరోగుల వైద్యం కోసం దేశంలో ఉద్యమించిన మొదటివ్యక్తీ కేరీనే.*


👉 *భారతదేశపు ప్రింట్ టెక్నాలజీకి పితామహుడు కేరీనేఆధునిక ప్రింటింగ్ ని, పబ్లిషింగ్ ని ఇండియాకుతెచ్చింది, నేర్పిందీ, అభివృద్ధి చేసిందీ ఆయనే.*


*ఇండియాలోనే అతి పెద్ద సిరంపూర్ మిషన్ ప్రెస్ 1800లో స్థాపించాడు.  ప్రింటర్లందరూ తమ ఫాంట్లను  సిరంపూర్ మిషన్ ప్రెస్ లోనేకొనుక్కునేవారు.*


👉  *సిరంపూర్ మిషన్ ప్రెస్ లో 1800-1832 కాలంలో 212000 పుస్తకాలు ప్రింటయ్యాయంటే మీరు నమ్మగలరా?*


👉 బెంగాలీలో మొదటి గద్య పుస్తకాన్ని కేరీనే ప్రచురించాడు. సంస్కృతంలో మొదట అచ్చువేయబడిన గ్రంధం *'హితోపదేశం'* కేరీ వల్లనేసాధ్యమైంది. తన సహచరుడు మార్షల్ తో కలిసి సంస్కృత రామాయణాన్ని, ఆంగ్లంలోకి అనువదించి,ముద్రించాడు.

Indian postal stamp about William Carey


👉 *1818లో వెలువడిన మొదటి ప్రాంతీయ వార్తా పత్రిక 'సమాచార్ దర్పణ్' కేరీ చలవే.*


👉 ప్రజాప్రతినిధులు, నాయకుల నాడిని తెలుసుకునేందుకు బెంగాలీలో  *'దిగ్దర్శన్'* అనే మాసపత్రికను ప్రచురించటం జరిగింది. ఆ రోజుల్లో అదొక సంచలనం.


👉 ఆయన ప్రచురించిన ఆంగ్ల పత్రిక  *'ఫ్రెండ్ ఆఫ్ఇండియా'* 19వ శతాబ్దం ప్రథమార్ధంలో ఇండియాలోరగులుకున్న సామాజిక చైతన్యానికిమూలకారణమయ్యింది. 


👉 *కేరీ మంచి భాషావేత్త అని చెప్పనవసరం లేదు. మరాఠా, పంజాబీ, తెలుగు, బెంగాలీ భాషల్లో వ్యాకరణ పుస్తకాలు రాసాడు. ప్రత్యేకంగా బెంగాలీభాషను ఉద్ధరించాడు. దేశంలోనే చక్కని సాహిత్యభాషగా దాన్ని తయారు చేసాడు. 'బంగ్లా అంగ్రేజీఅభిదాన్' అనే బెంగాలీ - ఇంగ్లీష్ డిక్షనరీని కూడాఅందించాడు. బెంగాలీలో క్రైస్తవ భక్తి గీతాలు కూడాకేరీ రచించాడు. కన్నడ, ఒరిస్సా, కాశ్మీరీ, నేపాలీ,గుజరాతీ, అస్సామీ భాషల్లోనూ వ్యాకరణ పుస్తకాలుతేవడానికి కృషి చేసాడు.*


👉  *"బెంగాలీ భాష పునరుజ్జీవమూ, అభివృద్ధి కోసం ఎంతైతే కృషి జరిగిందో, అదంతా కేరీ, ఆయన  సహచరుల వల్లనే జరిగిందని ఒప్పుకోక తప్పదు" అని రవీంద్రనాథ్ టాగూర్ స్వయంగా చెప్పటంలో ఆశ్చర్యం లేదు.*  


బెంగాలీ భాషకు కేరీ చేసిన సేవల్ని గుర్తించి, 1801లో ఫోర్ట్ విలియం కాలేజ్ ఆయన్ని బెంగాలీ ప్రొఫెసర్ నియమించింది. బెంగాలీ తో పాటు ఆయన మరాఠీ, సంస్కృత భాషల్నీ బోధించాడు. 


👉  *కేరీ గొప్ప లెక్సికోగ్రాఫర్(నిఘంటుకారుడు). పండితుల కోసం తొలి సంస్కృత నిఘంటువు రాసి, ప్రచురించాడు. మరాఠీ, బెంగాలీ, భూటాన్ భాషల్లో కూడా నిఘంటువులు చేసాడు.*


👉 విలియం కేరీ మహా గొప్ప సంస్కర్త. కేరీ ఇండియాలో అడుగు పెట్టే నాటికి దేశం పరిస్థితి అతి దుర్భరంగా ఉంది. ప్రపంచంలోనే అతి దారుణమైన మూఢాచారాలు ఇక్కడున్నాయి. బహుభార్యత్వం, (ఆడ)శిశు హత్యలు, బాల్య వివాహాలు,సతీసహగమనం, ఆడపిల్లలకి చదువు లేకుండాచేయటం మొదలైనవి. విడ్డూరమేమంటే, వీటన్నిటికీహైందవ మతం వత్తాసు పలకటం. ఈ దురాచారాలను రూపు మాపేందుకు  హైందవసామాజిక అంశాల్నీ, ఆధ్యాత్మిక గ్రంధాల్ని ఒక క్రమబద్దంగా అధ్యయనం చేసి, రచనలు చేసి,ప్రచురించాడు.  సామాన్య ప్రజలు నుంచి ప్రభుత్వఅధికారుల వరకు, ఇటు బెంగాల్ మొదలుకుని, అటుఇంగ్లాండ్ వరకు చైతన్యం కలిగించాడు. 'సతి'ని అరికట్టడానికి పాతికేళ్ళపాటు అవిశ్రాంత పోరాటమేచేసాడు. బాలికల కోసం స్కూళ్ళను తెరిచాడు.విధవలు క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పుడు, వారికిపెళ్ళిళ్ళు జరిపించాడు. ఈ విషయంలో రాజా రామ్మోహన రాయ్, కేశవ్ చంద్ర సేన్ వంటివారికి స్ఫూర్తివిలియం కేరీనే కదా!

Sati social evil


👉 *తను ఎన్ని రకాల వ్యవహారాలూ, సంస్కరణలూ, సమస్యల్లో తలమునకలవుతున్నా కేరీ తన అసలుపని - దేవుని వాక్యాన్ని స్థానిక భాషల్లోకి అనువదించేపనిని ఎన్నడూ అలక్ష్యం చేయలేదు.*


 బెంగాలీ, ఒరియా, మరాటీ, హిందీ, అస్సామీ, సంస్కృతం భాషల్లోకి బైబిల్ను స్వయంగా అనువదించాడు. పూర్తిగానో, పాక్షికంగానో, అనువాదమో, ప్రచురణమో, సంపాదకత్వమో ఏ విధంగానైనా కానీ దాదాపు నలభై భాషల్లోకి బైబిల్ రావడం వెనుక కేరీ అవిశ్రాంత కృషిఉంది. కేరీ చేసిన తెలుగు బైబిల్ అనువాదం సిరంపూర్ ప్రెస్ అగ్ని ప్రమాదంలో కాలిపోవటం దురదృష్టకరం.


*ఇన్ని అసాధారణ విజయాలు సాధించిన కేరీ తనపన్నెండవ ఏటనే స్కూలుకు స్వస్తి చెప్పాడంటేనమ్మగలమా? ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఈ దేశాన్ని సమూలంగా ఆధునీకరించడం ఎలా సాధ్యమైంది?*

 *'కేరీ ఎటువంటివాడంటే, అతడు నాకు బిషప్, ఆర్చ్ బిషప్కంటే గొప్పవాడు. అతడు అపోస్తలుడు' అని ప్రసిద్ధ దైవసేవకుడు జాన్ న్యూటన్ అన్నాడంటే కేరీ గొప్పతనాన్ని మనం ఊహించుకోవచ్చు.*

👉 *ఇంతకీ కేరీ ఎవరు? కేరీని ఏమని సంబోధించాలి?మిషనరీయా? సువార్తికుడా? సంస్కర్తా? పండితుడా?బహుముఖ ప్రజ్ఞాశాలా?*

👉 *ఏ టైటిల్ ఆయనకు సరిపోతుంది? మీరన్నా చెప్పగలరేమో ప్రయత్నించండి.....✍*


Watch William Carey movie Candle in the dark movie in telugu 👇

 https://youtu.be/xwo0-o7a8xs


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు