>

యేసు దేవుని కుమారుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? What does it mean that Jesus is the Son of God?

యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటి

 ఒక మానవ తండ్రి కుమారుల వలె యేసు దేవుని కుమారుడు కాదు. దేవుడు వివాహం చేసుకొని కుమారుని కనలేదు. దేవుడు మరియతో కూడుకొని, ఆమెతో కలసి, కుమారుని కనలేదు. ఆయన మానవ రూపంలో వచ్చిన దేవుని రూపంలో యేసు దేవుని కుమారుడు (యోహాను 1:1, 14). పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భము ధరించిన దానిలో యేసు దేవుని కుమారుడు. “దూత : పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును” అని లూకా 1:35 ప్రకటిస్తుంది.

Son of god


యూదా నాయకుల ఎదుట తీర్పులో యేసు నిలువబడినప్పుడు, ప్రథాన యాజకుడు యేసును అడిగాడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను” (మత్తయి 26:63). “అందుకు యేసు-నీవనట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పెను” (మత్తయి 26:64). యేసు దైవదూషణ చేస్తున్నాడని నిందిస్తూ యూదా నాయకులు స్పందించారు (మత్తయి 26:65-66). తరువాత, పొంతు పిలాతు ఎదుట, అందుకు యూదులు "మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి’” (యోహాను 19:7). ఆయన దేవుని కుమారుడని దావాచేయుట దైవదూషణగా ఎందుకు పరిగణించబడింది మరియు మరణ శిక్షకు ఎందుకు అర్హమైయింది? “దేవుని కుమారుడు” అను మాట ద్వారా యేసు  ఏమి చెప్పాడో  యూదా నాయకులు అర్థం చేసుకున్నారు. 

దేవుని కుమారుడైయుండుట అంటే దేవుని స్వభావంలో ఉండుట. దేవుని కుమారుడు “దేవుని వాడు.” దేవుని స్వభావంలో ఉన్నానని దావా చేయుట-వాస్తవానికి దేవుడైయుండుట-యూదా నాయకులకు దైవదూషణ; కాబట్టి, వారు లేవీ. 24:15 ఆధారంగా యేసు మరణమును కోరారు. హెబ్రీ 1:3 దీనిని స్పష్టముగా వ్యక్తపరుస్తుంది, “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవత్వము యొక్క మూర్తిమంతమునైయున్నాడు.”

Doctrine of christology


యూదా “నాశన పుత్రునిగా” వర్ణించబడిన యోహాను 17:12లో మరొక ఉదాహరణ ఉంది. యూదా సీమోను కుమారుడని యోహాను 6:71 మనకు చెబుతుంది. యూదాను “నాశన పుత్రునిగా” వివరించుట వలన యోహాను 17:12 యొక్క అర్థం ఏమిటి? నాశనం అను పదమునకు అర్థం “వినాశనం, వ్యర్థం, పతనం.” యూదా అక్షరార్థంగా “వినాశనం, వ్యర్థం, మరియు పతన” పుత్రుడు కాదు, అవి యూదా జీవితము యొక్క గుర్తింపు. యూదా నాశనమునకు స్వరూపము. అదే విధంగా, యేసు దేవుని కుమారుడు. యేసు దేవుని స్వరూపము (యోహాను 1:1, 14).

Listen to this English Audio..