>

యాకోబు ఎవరితో పోరాడాడు? ఆ వ్యక్తి ఎవరు? యాకోబుతో పోరాడిన దూత ఎవరు?

యాకోబు ఎవరితో పోరాడాడు? ఆ వ్యక్తి ఎవరు? యాకోబుతో పోరాడిన దూత ఎవరు? 

Who was the man wrestled with Jacob? 


ఆదికాండము 32:24-30

యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.

తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడువసిలెను. 

ఆయన తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

                                Jacob wrestled with God

ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను.

అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. 

అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనినాశీర్వదించెను. 

యాకోబు నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.


     ఆదికాండము 32:30 లో God దేవుని అనే దగ్గర హీబ్రూ లో Elohim ఎలోహిమ్ అని రాసారు..



 
ఆదికాండము 1వ అధ్యాయం లో కూడా దేవుడు God అనే పదం దగ్గర Elohim ఎలోహిమ్ వాడారు



  హొషేయ 12:1-5

1.ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ద మాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.

2.యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయును.

3.తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కల వాడై అతడు దేవునితో పోరాడెను.

4.అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను; 

5. యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా The LORD of the Hosts అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.

       



ఆ రాత్రి యాకోబు తో పోరాడిన వ్యక్తి ఎవరో కాదు! ఈయన ప్రభువైన యేసుక్రీస్తే!!


యోహాను 5:43

నేను తండ్రి పేరు మీద వచ్చానని యేసు చెప్పాడు..

యెహోవా నామము యేసయ్య కి కలదు.


ఈ వీడియో చూడండి.. Watch this video..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు